Mohammed Zubairకి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఢిల్లీ దాటి వెళ్లొద్దని సూచించిన Supreme Court

ABN , First Publish Date - 2022-07-08T21:51:25+05:30 IST

మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరించాడనే ఆరోపణలపై అరెస్టయిన ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు(Alt news co-fo

Mohammed Zubairకి మధ్యంతర బెయిల్ మంజూరు.. ఢిల్లీ దాటి వెళ్లొద్దని సూచించిన Supreme Court

న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై అరెస్టయిన ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు(Alt news co-founder) మహ్మద్ జుబైర్(Mohammed Zubair)కి సుప్రీంకోర్ట్(Supreme Court) బెయిల్(Bail) మంజూరు చేసింది. జుబైర్ పిటిషన్‌(Petition)ను పరిశీలించిన పిమ్మట 5 రోజుల మధ్యంతర బెయిల్(Interm bail) జారీ చేస్తూ జస్టిస్ ఇందిరా బెజర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన వెకేషన్ బెంచ్(Vacation Bench) శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఉత్తరప్రదేశ్‌(Uttara pradesh)లోని సీతాపూర్‌(Sitapur)లో నమోదయిన ఎఫ్ఐఆర్(FIR) విషయంలోనే మధ్యంతర బెయిల్ మంజూర్ చేశామని, ఢిల్లీ(Delhi)లో నమోదయిన కేసుతో ఈ బెయిల్‌కి సంబంధంలేదని స్పష్టం చేసింది. కాగా బెయిల్‌పై ఉన్న సమయంలో కేసుకు సంబంధించి ట్విటర్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టింగ్స్ చేయవద్దని న్యాయమూర్తులు సూచించారు. ఢిల్లీ పరిధి దాటివెళ్లవద్దునని స్పష్టం చేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను రెగ్యులర్ బెంచ్ ముందు చేర్చింది. 


తన ట్వీట్ల ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై జుబైర్‌పై కేసులు నమోదయ్యాయి. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 (అల్లర్లు చెలరేగాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం), సెక్షన్ 295ఏ (ఏదైనా వర్గం యొక్క మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం),  ఐటీ చట్టంలోని సెక్షన్ 67ల కింద ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో Mohammed Zubairపై కేసు నమోదయింది. హిందూ షేర్ సేన సీతాపూర్ జిల్లా అధ్యక్షుడు భగవాన్ శరన్ ఫిర్యాదు మేరకు జూన్ 1న కేసు నమోదయ్యింది. కాగా జూన్ 27న అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-07-08T21:51:25+05:30 IST