సీబీఐ-ఈడీలపై సుప్రీం ఎందుకు సీరియస్ అయింది?

ABN , First Publish Date - 2021-08-26T02:03:01+05:30 IST

చట్ట సభల సభ్యులపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో ..

సీబీఐ-ఈడీలపై సుప్రీం ఎందుకు సీరియస్ అయింది?

న్యూఢిల్లీ: చట్ట సభల సభ్యులపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 10-15 సంవత్సరాలవుతున్నా ఛార్జిషీట్లు ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీసింది. ఈడీ కేవలం ఆస్తులను జప్తు చేయడం మినహా ఇంకేమీ చేయడం లేదని మండిపడింది. 


పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోందని ప్రశ్నించారు. కేసులు నమోదై 10-15 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఛార్జిషీట్లను ఎందుకు దాఖలు చేయడం లేదని నిలదీశారు. కేసులను సాగదీయవద్దని, ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.


ఈ తరుణంలో ‘‘సీబీఐ-ఈడీలపై సుప్రీం ఎందుకు సీరియస్ అయింది?. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్లో చార్జిషీట్లు వేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిందా?. జీవిత ఖైదు పడే కేసుల్లోనూ జరుగుతున్న జాప్యాన్ని సహించవచ్చా?. కొందరి కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాకపోవడం చట్టం చేస్తున్న తప్పు కాదా?. సుప్రీం అసహనం, ఆగ్రహంతోనైనా దేశానికి పట్టిన పీడ విరగడవుతుందా?.’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 







Updated Date - 2021-08-26T02:03:01+05:30 IST