మాస్కు వద్దనుకుంటే ఇంట్లో కూర్చోండి

ABN , First Publish Date - 2022-09-23T07:42:35+05:30 IST

మాస్కు ధరించడం ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండేలే తప్ప బయటకు రాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మాస్కులు కట్టుకోవడం అవసరం

మాస్కు వద్దనుకుంటే ఇంట్లో కూర్చోండి

తెలంగాణ న్యాయవాదికి సుప్రీంకోర్టు లక్ష జరిమానా


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: మాస్కు ధరించడం ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండేలే తప్ప బయటకు రాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మాస్కులు కట్టుకోవడం అవసరం లేదంటూ పిటిషన్లు వేయడం తగదని అభిప్రాయపడింది. కరోనాను దృష్టిలో పెట్టుకొని మాస్కును ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2021 మార్చి 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్రానికి చెందిన న్యాయవాది కె.శ్రీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది. కోర్టు ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - 2022-09-23T07:42:35+05:30 IST