Income Tax కట్టనంటూ అడ్డం తిరిగిన NRI.. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..

ABN , First Publish Date - 2021-09-08T23:31:33+05:30 IST

ఓ ఎన్నారై ఆదాయపు పన్ను విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కరోనా వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో తాను స్వదేశంలో చిక్కుకున్నానని.. దానికి తనను ఇక్కడ ట్యాక్స్ కట్టమని అడగడం సమంజసం కాదంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) నోటీసులను చాలెంజ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కాడు.

Income Tax కట్టనంటూ అడ్డం తిరిగిన NRI.. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..

ఎన్నారై డెస్క్: ఓ ఎన్నారై ఆదాయపు పన్ను విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కరోనా వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో తాను స్వదేశంలో చిక్కుకున్నానని.. దానికి తనను ఇక్కడ ట్యాక్స్ కట్టమని అడగడం సమంజసం కాదంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) నోటీసులను చాలెంజ్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కాడు. భారత ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం తనను నాన్-రెసిడెంట్‌గా గుర్తిస్తూ సీబీడీటీ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. 2021, మార్చి 3న సీబీడీటీ తనకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 


ఇది కూడా చదవండి..

Chicago: విమానం మిస్ చేసుకున్న మహిళ.. కన్నింగ్‌ ఐడియాతో అధికారులకు చుక్కలు! 

Saudi నుంచి వచ్చిన విమానం.. ఓ ప్రయాణికుడిని కారులో వెంబడించిన పోలీసులు.. క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో..

ఆయన పిటీషన్‌ను జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బెలా ఎం త్రివేది ముగ్గురు న్యాయముూర్తుల బెంచ్ పరిశీలించింది. చివరకు ఎన్నారైదే తప్పుగా తేల్చింది. మధ్యలో జూలై మాసంలో ఎయిర్ బబుల్ విధానం అమలులోకి వచ్చిందని, దాన్ని పిటీషనర్ వినియోగించుకోలేదని చెప్పుకొచ్చింది. గతేడాది మార్చి 6న దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన ఎన్నారై.. అక్టోబర్ 5న తిరిగి వెళ్లడం జరిగింది. దాంతో స్వదేశంలో 182 రోజులు దాటి ఉన్నాడు. దాంతో ఇండియన్ రెసిడెంట్‌గానే పరిగణించడం జరుతుందని బెంచ్ పేర్కొంది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ఆదాయపు పన్ను చెల్లించాల్సిందిగా న్యాయస్థానం తేల్చింది. 


ఇక పిటీషనర్ ప్రస్తుతం తాను ఎన్నారైగా దుబాయిలో ఉంటున్నానని, కుబెర్ ట్రేడింగ్ ఎఫ్‌జెడ్ఈలో అకౌంటింగ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ ప్రవాసులకు ట్యాక్స్ మినహాయింపు ఉన్నట్లు తెలిపారు. భారత్ వంటి హైట్యాక్స్ దేశాల ప్రవాసులను ఆకర్షించేందుకు యూఏఈ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. యూఏఈతో పాటు బహ్రెయిన్, బ్రూనై, ఒమన్, ఖతర్, కువైత్ వంటి దేశాలు కూడా ప్రవాసులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటా ప్రకారం ఈ దేశాల్లో సుమారు 60 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఒక్క యూఏఈలోనే దాదాపు 34 లక్షల మంది భారత పౌరులు ఉంటున్నారని తెలిపారు. 


ఇదిలాఉంటే.. ఎన్నారైలను ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్-6 ప్రకారం భారత పౌరులుగా పరిగణించేందుకు ముఖ్యంగా రెండు నిబంధనలు ఉన్నాయి. ఒకటి విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చినప్పుడు 182 రోజుల కంటే ఎక్కువ కాలంలో ఇక్కడే ఉండడం. రెండోది నాలుగేళ్ల కాలంలో 365 రోజుల కంటే అధికంగా ఇండియాలోనే ఉన్న కూడా ఇక్కడివారిగానే పరిగణించడం జరుగుతుంది. ఈ రెండు సందర్భాల్లో ఎన్నారైలు తప్పకుండా స్వదేశంలో ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే.        




Updated Date - 2021-09-08T23:31:33+05:30 IST