మహారాష్ట్ర మాజీ హోం మంత్రికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-08-19T00:34:42+05:30 IST

అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనపై సీబీఐ..

మహారాష్ట్ర మాజీ హోం మంత్రికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారంనాడు కొట్టివేసింది. ''ఆధారాలన్నీ పరిశీలించిన మీదట ఆర్టికల్ 136 ప్రకారం కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనపబడ లేదు. హైకోర్టు తీర్పులో ఎలాంటి పొరపాట్లు లేవు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం'' అని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.


ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ సింగ్ థాకరేకు రాసిన లేఖలో తనపై అవినీతి ఆరోపణలు చేశారని, దాని ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని దేశ్‌ముఖ్ గతంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జూలై 22న హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో అనిల్ దేశ్‌ముఖ్ సవాలు చేసినప్పటికీ అక్కడ కూడా తాజాగా చుక్కెదురైంది.

Updated Date - 2021-08-19T00:34:42+05:30 IST