Central Vista ప్రాజెక్టుపై మరో పిటిషన్‌ను తిరస్కరించిన Supreme court

ABN , First Publish Date - 2021-11-23T20:44:10+05:30 IST

రక్షిత స్థలాన్ని నివాస ప్రాంతంగా మార్చి, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో

Central Vista ప్రాజెక్టుపై మరో పిటిషన్‌ను తిరస్కరించిన Supreme court

న్యూఢిల్లీ : రక్షిత స్థలాన్ని నివాస ప్రాంతంగా మార్చి, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ భూమి వినియోగాన్ని మార్చడానికి కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని తెలిపింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలిపింది. 


ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి తగిన కారణం లేదని, అందువల్ల దీనిని తోసిపుచ్చడం ద్వారా మొత్తం వివాదానికి ముగింపు పలుకుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవి కుమార్ కూడా ఉన్నారు. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనాన్ని, ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని, ఇతర కార్యాలయాలను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును 2019 సెప్టెంబరులో ప్రకటించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయ్యేనాటికి, అంటే 2022నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 


Updated Date - 2021-11-23T20:44:10+05:30 IST