సామూహిక వంటశాలలపై నిర్ణయం తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-28T08:48:36+05:30 IST

అన్నమో రామచంద్రా అని అలమటించే వారి క్షుద్బాధ తీర్చేందుకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు సామూహిక వంటశాలల పథకాన్ని..

సామూహిక వంటశాలలపై నిర్ణయం తీసుకోండి

కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 27: అన్నమో రామచంద్రా అని అలమటించే వారి క్షుద్బాధ తీర్చేందుకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు సామూహిక వంటశాలల పథకాన్ని అమలు చేసేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది. కొన్ని రాష్ట్రాలలో ఆకలిచావులు, పౌష్టికాహార లోపంతో పిల్లలు బాధపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, అవి జరిగిన జిల్లాలు, గ్రామాల వివరాలతో సమాధానాలు ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.  


Updated Date - 2021-10-28T08:48:36+05:30 IST