Supreme Court: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN , First Publish Date - 2022-08-10T20:10:25+05:30 IST

షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది.

Supreme Court: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ : 2004లో షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ మాత్రమే సమస్య పరిష్కరించాలని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. 18 ఏళ్ల పాటు వర్గీకరణ లేక మాదిగ ఉప కులాలు నష్టపోయాయని మంద కృష్ణ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్టాలలో ఏడుగురు లేదా ఎనిమిది మంది జడ్జీల లార్జర్ బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందన్నారు. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు.


కాగా.. పలు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుమతివ్వాలంటూ సుప్రీంలో ఎమ్మార్పీఎస్ పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ జరిపింది. పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గకరణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్పీ‌ఎస్ పిటిషన్‌లో కోరింది. 2004లో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2004లో వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం ధర్మాసనం సిఫారసు చేసింది. విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణపై శాశ్వత తీర్పు ఇవ్వాలని తాజా పిటిషన్‌లో ఎమ్మార్పీఎస్ కోరింది.



Updated Date - 2022-08-10T20:10:25+05:30 IST