సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-09-06T19:16:45+05:30 IST

సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ చేపట్టిన కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదని..

సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ చేపట్టిన కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు సీబీఐ ఎన్ని కేసులు చేపట్టింది?, ఎన్ని నిరూపించింది?, ఎందరికి శిక్ష పడింది?, ఎన్ని పెండింగ్‌ కేసులు ఉన్నాయో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ... జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.


జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన..కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ కేసు విషయంలో పంజరంలో చిలుకకు స్వేచ్ఛ అవసరం అంటూ.. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ కౌల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిబ్బంది, మౌలిక వసతుల లేమి కారణంగా..ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పాలని సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశించారు. సీబీఐ చేపట్టిన కేసులు న్యాయస్థానాల్లో ఎందుకు నిలబడటంలేదో.. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2021-09-06T19:16:45+05:30 IST