వలస జీవుల వెతలపై సుప్రీం ఆందోళన

ABN , First Publish Date - 2020-04-04T06:59:58+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, ఇతర అసంఘటితరంగ కార్మికుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరికి కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వానికి

వలస జీవుల వెతలపై సుప్రీం ఆందోళన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వల్ల జీవనోపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, ఇతర అసంఘటితరంగ కార్మికుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరికి కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 7వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని  ఆదేశించింది. ప్రముఖ సామాజిక, హక్కుల కార్యకర్తలు హర్ష్‌ మండేర్‌, అంజలి భరద్వాజ్‌ దాఖలు చేసిన ఈ ప్రజాహిత దావాను, వారి వినతిని  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అడ్డుకున్నారు. ‘‘ఈ ప్రజాప్రయోజనాల వాజ్యాల(పిల్‌) దుకాణాలను మూసివేయాలి. నిజమైన వ్యక్తులు క్షేత్రస్థాయిలో ప్రజలకు సాయం చేస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చొని పిల్‌లు దాఖలు చేయడం వల్ల ఉపయోగం లేదు.’’ అని ఆయన వాదించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అనేక మందిని పనుల్లోంచి తీసేశారని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన బెంచ్‌ దృష్టికి తెచ్చారు.

Updated Date - 2020-04-04T06:59:58+05:30 IST