ప్రజాధనంతో ఉచితాలా?.. సుప్రీంలో పిటిషన్‌

ABN , First Publish Date - 2022-01-23T07:42:12+05:30 IST

రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలు ఇవ్వడాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం అసంబద్ధ ఉచితాల హామీలిచ్చే పార్టీల గుర్తును సీజ్‌ చేయడం లేదా...

ప్రజాధనంతో ఉచితాలా?.. సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలు ఇవ్వడాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం అసంబద్ధ ఉచితాల హామీలిచ్చే పార్టీల గుర్తును సీజ్‌ చేయడం లేదా గుర్తింపును రద్దు చేసేలాఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ప్రజాధనంతో ఉచితాలు ఇస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరా రు. వీటిని లంచం ఇస్తున్నట్లుగా పరిగణించి నేరంగా ప్రకటించాలన్నారు. స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం, ఉచితాల హామీలివ్వడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమన్నారు. 

Updated Date - 2022-01-23T07:42:12+05:30 IST