ఇమ్రాన్ ఖాన్-షెబాజ్ షరీష్ మద్దతుదారుల ముష్టిఘాతాలు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-04-15T01:47:43+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కొత్త ప్రధాని షెబాజ్ షరీఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు

ఇమ్రాన్ ఖాన్-షెబాజ్ షరీష్ మద్దతుదారుల ముష్టిఘాతాలు.. వీడియో వైరల్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కొత్త ప్రధాని షెబాజ్ షరీఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఆగ్రహంతో ఒకరిని ఒకరు దూషించుకోవడంతోపాటు అక్కడ టేబుల్‌పై ఉన్న ఆహారం, పానీయాన్ని ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఆ వెంటనే నల్లని కుర్తాలో ఉన్న ఓ యువకుడు వచ్చి వృద్ధుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్న జనం ఆ యువకుడిని ఆపే ప్రయత్నం చేశారు. యువకుడి దెబ్బలతో కిందపడిన వృద్ధుడిని మరికొందరు లాగిపడేయడం వీడియోలో కనిపించింది. 


వారం రోజులపాటు నడిచిన రాజకీయ డ్రామా అనంతరం ఈ నెల 9న పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలయ్యారు. దీంతో షెబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ రికార్డులకెక్కారు. 



Updated Date - 2022-04-15T01:47:43+05:30 IST