ప్రవీణ్‌కుమార్‌కుజై భీం యూత్‌ ఇండియా మద్దతు

ABN , First Publish Date - 2021-07-30T04:35:59+05:30 IST

ప్రవీణ్‌కుమార్‌కుజై భీం యూత్‌ ఇండియా మద్దతు

ప్రవీణ్‌కుమార్‌కుజై భీం యూత్‌ ఇండియా మద్దతు
ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌తో జంతుక శంకర్‌

ఆమనగల్లు/తలకొండపల్లి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమానత్వమే ధ్యేయంగా పనిచేసేందుకు ఉద్యోగ విరమణ చేసిన ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌కు జైభీం యూత్‌ ఇండియా సంపూర్ణ మద్దతు ఇస్తోందని జేబీవైఐ రాష్ట్ర అ ధ్యక్షుడు జంతుక శంకర్‌ తెలిపారు. గురువారం జైభీం యూత్‌ రాష్ట్ర నాయకులతో కలిసి శంకర్‌ హైదరాబాద్‌లో ప్రవీణ్‌కుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓంప్రకాశ్‌, కార్యదర్శి శ్రీను, చందు, జగదీశ్‌, అమరేందర్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌ ఉన్నారు. స్వేరోస్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు పి.సంతోష్‌ ఆధ్వర్యంలో తలకొండపల్లి మండల స్వేరోస్‌ సభ్యులు ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. బీఎస్పీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు సుభాకాంక్షలు తెలిపినట్లు సంతోష్‌ తెలిపారు.

Updated Date - 2021-07-30T04:35:59+05:30 IST