నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-07-28T05:01:42+05:30 IST

నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు చింతాడ గణపతిరావు, కార్యదర్శి హరికుమార్‌ కోరారు. మంగళవారం సంఘ కార్యాలయంలో వివిధ గ్రానైట్‌ కంపెనీల యజ మానులతో సమావేశం నిర్వహించారు.

నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోండి
సమావేశం నిర్వహిస్తున్న గ్రానైట్‌ క్వారీ యజమానులు

టెక్కలి, జూలై 27: నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు చింతాడ గణపతిరావు, కార్యదర్శి హరికుమార్‌ కోరారు. మంగళవారం  సంఘ కార్యాలయంలో వివిధ గ్రానైట్‌ కంపెనీల యజ మానులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్‌ పరిశ్రమలపై వివిధ రూపాల్లో పన్నుల పెంపు కారణంగా పరిశ్రమలపై అద నపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలో విశాఖలో గ్రానైట్‌ యజమానుల సమావేశం నిర్వహించను న్నట్లు పేర్కొన్నారు. వెంకటాచలపతి, అల్లు నగేష్‌, మలయంటి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-28T05:01:42+05:30 IST