Abn logo
Sep 18 2021 @ 02:14AM

ఆరోగ్యవంతమైన సమాజానికి తోడ్పాటునందించాలి

భువనగిరి మండలం వడాయిగూడెంలో వీధిని ఊడ్చి శుభ్రం చేస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పిలుపు నిచ్చారు. స్వచ్ఛతాహి సేవ–2021 కార్యక్రమం పురస్కరించుకు మండలం లోని భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వ హించిన పలు  పరిశుభ్రత కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.   గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్య మన్నారు. అక్టోబరు రెండో తేదీ వరకు ప్రతీ గ్రామంలో సంపూర్ణ పారిశుధ్యం, హరితహారం కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. బహి రంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తి పలికి ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డిని  నిర్మించుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.  పలు ప్రధాన వీధులను శుభ్రపర్చే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుండు మనీష్‌గౌడ్‌, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి, జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, ఎంపీడీవో నాగిరెడ్డి, ఉప సర్పంచ్‌ జమిని పోశెట్టి, గ్రామస్థులు పాల్గొన్నారు.