Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులను ఆదుకోవాలి: సుబ్బారెడ్డి

డోన్‌, నవంబరు 28: అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని మండల మాజీ ఉపాధ్యక్షురాలు మర్రి సరళాదేవి, సీనియర్‌ న్యాయవాది ఆంజనేయులు గౌడు, నేరెడుచర్ల శేషారెడ్డి, మల్లెంపల్లి రామదాసులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గంలో ఈ ఏడాది కరువు పరిస్థితులతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పుడు వర్షాల కారణంగా రైతులకు తీరని నష్టం జరిగిందని తెలిపారు. పెట్టుబడులు చేతికి రాక రైతులు అప్పులపాలయ్యారన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దారుణన్నారు. ఎకరాకు రూ.25వేల నష్టపరిశారాన్ని నష్టపోయిన రైతులకు అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి పక్షాన నిలబడి టీడీపీ పని చేస్తుందని తెలిపారు. సీనియర్‌ న్యాయవాది మధుసూదన్‌ గౌడు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


Advertisement
Advertisement