అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-24T11:23:17+05:30 IST

అకాల వర్షాల వల్ల నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఎంపీ అర్వింద్‌, బీజేపీ నేతలు శుక్రవారం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కలెక్టర్‌కు ఎంపీ అర్వింద్‌, బీజేపీ నేతల వినతి


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 23: అకాల వర్షాల వల్ల నష్టపోయిన  జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఎంపీ అర్వింద్‌, బీజేపీ నేతలు శుక్రవారం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. వారం రోజులు జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల వరి, మొక్కజొన్న, సోయా పంటలు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. ఎకరాకు రూ.25 వేల పరిహారాన్ని ఇచ్చి ఆదు కోవాలని కోరారు. తసిన, మొలకలు వచ్చిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనతో రైతులంతా సన్నరకం ధాన్యాన్ని వేశారని, దానికి క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలన్నారు. మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, ప్రధాన కార్యదర్శి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్‌లు మల్లేష్‌ యాదవ్‌, నాయకులు ఆకుల శ్రీనివాస్‌, రాజశేఖర్‌రెడ్డి, మీసాల శ్రీనివాస్‌రావు, పంచరెడ్డి లింగం, మధు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

ఆర్మూర్‌రూరల్‌ : వరి, సోయా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. ఆర్మూర్‌ మండలం పిప్రిలో శుక్రవారం అకాల వర్షాలతో నెలకొరిగిన వరి పంటను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ మాటలు నమ్మి రైతులు సన్నరకం వరి సాగు చేశారని, పంటపై దోమపోటు ఆశించి దిగుబడి తగ్గిందని అన్నారు. అకాల వర్షాలకు పంట నేలకొరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్నరకం వరిధాన్యం కొనుగోలు  చేయాలన్నారు. సోయా పంట వేసిన రైతులు నష్టాలకు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశా రు. అదే విధంగా మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులకు కూడా నష్టాలే మిగిలాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకో చేస్తే అరెస్టు చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్య దర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వాలక్ష్మీనర్సయ్య, శివరాజ్‌కుమార్‌, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, కౌన్సిలర్‌ నర్సింహారెడ్డి, మండ లాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉదయ్‌, తదితరులు పాల్గొన్నారు. 


దుర్గామాతను దర్శించుకున్న ఎంపీ.. 

మాక్లూర్‌: మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ దుర్గామాతను దర్శించుకొని పూజలు చేశారు. స్థానిక నాయకులు ఆయనకు శాలవా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:23:17+05:30 IST