నకిలీ విత్తన బాధిత రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T05:42:56+05:30 IST

జిల్లాలో నకిలీ సోయాబీన్‌ విత్తనాలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదు కోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని తలమడుగు, డోర్లి, ఝరి గ్రామాల్లో గల రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు.

నకిలీ విత్తన బాధిత రైతులను ఆదుకోవాలి
జిల్లాకేంద్రంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

తలమడుగు, జూన్‌ 29: జిల్లాలో నకిలీ సోయాబీన్‌ విత్తనాలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదు కోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు  బుధవారం మండలంలోని తలమడుగు, డోర్లి, ఝరి గ్రామాల్లో గల రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాజిద్‌ఖాన్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా మండలాల్లో నకిలీ సోయా విత్తనాలు నాటడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. నకిలీ సోయా విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని నిఖిల్‌ ట్రడర్స్‌ లేదా రైతులకు విక్రయించిన కంపెనీ నుంచైనా రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో నకిలీ విత్తనాలు విషయమై పార్లమెంట్‌లో లేవనెత్తడం జరుగుతుందన్నారు. కాగా తలమడుగు గ్రామానికి చెం దిన రావుల ప్రేమేందర్‌రెడ్డి పది ఎకరాల కౌలు భూమిలో సోయాబీన్‌ విత్తనాలు విత్తగా మొలకెత్తక రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి, ఎంపీటీసీ వెంకట్‌ యాదవ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు ప్రకాష్‌రావు, నగేష్‌, మల్లేష్‌యాదవ్‌, ఆనంద్‌రావు, కస్తాల ప్రతాప్‌, రాహుల్‌చంద్రుల, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

ఇంద్రవెల్లి: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీర్‌ఎస్‌ ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంద ని కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌహాన్‌ భారత్‌ విమర్శించా రు. బుఽధవారం మండలంలోని అంజి గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి సోయాబీన్‌ మొలకెత్తని పంట పొలాలను పరిశీలించారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సోమోరే నాగోరావు, నాయకులు ముఖడే ఉత్తం, రాథోడ్‌ గణేష్‌, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

రైతుల పక్షాన కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలో రైతులు నాటిన సోయా విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత ఆధ్వర్యంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి ఆదుకోవాలని బుధవారం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌సుజాత మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలను అందించాలన్నారు.కార్యక్రమంలో డీసీసీ ఇన్‌చార్జీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ కొండ గంగాధర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లూరి సంజీవరెడ్డి, యాసంనర్సింగ్‌రావు, కౌన్సిలర్‌ అంబకంటి అశోక్‌, సృజన్‌రెడ్డి, ఆనంద్‌రావు, దండు మధుకర్‌, కిష్టయ్య, గంగారెడ్డి, చిన్నయ్య, తదితరులున్నారు.

విత్తనాలు మొలకెత్తలేదని జాతీయ రహదారిపై ధర్నా

ఇచ్చోడ: వందలాది ఎకరాలలో వేసిన సోయావిత్తనం మొలకెత్తక పోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాఽధత రైతులు రోడెక్కారు. బుధవారం మండల కేంద్రంలో బజార్‌హత్నుర్‌ మండలం గిర్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 50మందికి పైగా రైతులు స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద ధర్నా చేపట్టారు. సంబందించిన వ్వవసాయాధికారులు పలుమార్లు విన్నవించినా ఫలి తం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-06-30T05:42:56+05:30 IST