Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈయూ అభ్యర్థులను బలపరచండి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 5 : ఆంధ్రప్రదేశ్‌ ప్రజారవాణాసంస్థ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ అభ్యర్థులను బలపరచాలని ఆ యూనియర్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జోనల్‌ కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌లు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి స్థానికంగా ఏపీపీటీడీ ఈయూ, వైఎ్‌సఆర్‌ అసోసియేషన్‌ ఐక్యవేదిక  సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మా ట్లాడుతూ ఈనెల 14న గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు జరుగుతున్న నేపఽథ్యంలో ప్రొద్దుటూరు డిపోకు సంబంధించి సీసీఎస్‌ డెలిగేట్లకు ఈయూ అభ్యర్థులుగా కె. నాగబ్రహ్మం, బీవీ రమణలు బరిలో ఉన్నారని, వారికి అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఆ యూనియర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబా ఫకృద్దీన్‌, జోనల్‌ ప్రెసిడెంట్‌ కేకే కుమార్‌, వైఎ్‌సఆర్‌ జోనల్‌ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ నారాయణ, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement