టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-02-25T05:36:40+05:30 IST

నగర పంచాయతీలోని అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్య కర్తలు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ఎమ్మెల్యే రవికుమార్‌


అద్దంకి, ఫిబ్రవరి 24 :  నగర పంచాయతీలోని అన్ని  వార్డుల్లో టీడీపీ  అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్య కర్తలు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నగ ర పంచాయతీ ఎన్నికలపై ఆయన నాయకులు, కార్యకర్తల తో బుధవారం వార్డుల వారీగా చర్చించారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ టీడీపీ హయాంలో అద్దంకిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాలన్నారు. పలు వా ర్డులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల ఎంపిక పై చర్చించి స్పష్టత ఇచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు కోనేటి  వెంకటేశ్వర్లు, సందిరెడ్డి శ్రీనివాసరావు, బొడ్డపాటి రవిబాబు, కుందారపు రామారావు, చుండూరి మురళీ సుధాకర్‌, రామాంజనేయులు, గోపి, సురేంద్ర, కాంతయ్య, చెన్నుపల్లి నాగేశ్వరరావు, వలి పాల్గొన్నారు.

గొర్రెపాడు అభివృద్ధికి సహకారం

 బల్లికురవ: గొర్రెపాడు గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రవికుమార్‌ చెప్పారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన ముండ్రు చినదానయ్య, వార్డు సభ్యులు బుధవారం చిల కలూరిపేటలోని తన స్వగృహంలో ఉన్న రవికుమార్‌ను క లిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. గ్రామంలో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. 


Updated Date - 2021-02-25T05:36:40+05:30 IST