ట్రెజరీ ఉద్యోగులతో ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2022-01-28T00:24:27+05:30 IST

రాష్ట్రంలోని ట్రెజరీ ఉద్యోగులతో ఉన్నతాధికారులు వీడియో

ట్రెజరీ ఉద్యోగులతో ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: రాష్ట్రంలోని ట్రెజరీ ఉద్యోగులతో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే చర్యలు తీసుకున్నా సరే బిల్లులు ప్రాసెస్‌ చేయబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. పెన్షనర్ల బిల్లులను పంపుతున్నామంటూ వెరిఫై చేసి పంపాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చారు. తాము వెరిఫై చేసి పంపలేమని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమను ఇబ్బంది పెట్టొద్దని ట్రెజరీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రవికుమార్‌  విజ్ఞప్తి చేశారు. వేరే శాఖల బిల్లులు వస్తే పంపాలని ఉన్నతాధికారులు  సూచించారు. వస్తే పంపుతామని ట్రెజరీ ఉద్యోగులు చెప్పారు. తమకు పాత జీతాలే ఇవ్వాలంటూ ఉద్యోగులు నేరుగా లేఖలు రాస్తున్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణతో ఉన్నతాధికారులు అయోమయంలో ఉన్నారు.  


Updated Date - 2022-01-28T00:24:27+05:30 IST