సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్గా నటించారు. మే 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటుండగా.. చిత్ర సాంకేతిక నిపుణులు ఈ సినిమా గురించి చెబుతున్న విషయాలు సినిమాపై భారీ క్రేజ్‌కి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ సర్ప్రైజ్ అంటూ మేకర్స్ ఓ ప్రకటన చేశారు.
‘‘ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ సూపర్ సర్ప్రైజ్ (Sarkaru Vaari Paata Super Surprise) రాబోతోంది. ‘సర్కారు వారి పాట సూపర్ సర్ప్రైజ్’ రేపు (గురువారం).. అప్పటి వరకు వేచి ఉండండి..’’ అని మేకర్స్ అధికారికంగా ట్వీట్ చేశారు. దీంతో ఆ సూపర్ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా? అని అభిమానులు బాగా ఎగ్జయిట్ అవుతున్నారు. బహుశా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చేవారే ఈ సర్‌ప్రైజ్‌కి కారణమేమో అని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. మరి అదేంటి? అనేది తెలుసుకోవాలంటే గురువారం వరకు వెయిట్ చేయక తప్పదు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ ని నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతోంది.