పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో దశకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. సినీ సెలబ్రిటీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తమ స్నేహితులను నామినేట్ చేసి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. తాజాగా ఆదివారం(ఆగస్ట్9) రోజున పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న సూపర్‌స్టార్ మహేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. ‘‘పుట్టినరోజును ఇంతకంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోలేను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో తారక్, విజయ్(కోలీవుడ్ హీరో), శృతిహాసన్ పాల్గొని చెయిన్‌ను కంటిన్యూ చేయాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సరిహద్దులు దాటాలని కోరుకుంటున్నాను. పచ్చదనం వైపు మనమందరం అడుగులు వేయాలని కోరుకుంటున్నాను’’ అని మహేశ్ ట్వీట్ చేశారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన సంతోష్ కుమార్‌ను మహేశ్ అభినందించారు.