అమరావతి: సినిమా టికెట్ల వ్యవహారంలో అందరి తరపున ప్రభుత్వంతో చర్చలు జరిగేలా దారి చూపించినందుకు మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ అనంతరం మహేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... సినిమా టికెట్ల అంశంలో గత కొద్ది నెలలుగా గందరగోళంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించిందని అన్నారు. రానున్న పదిరోజుల్లో ఓ శుభవార్త మన ముందుకు రాబోతోందన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై స్పందించి చర్చలకు ఆహ్వానించిన మంత్రి పేర్నినానికి, సీఎం జగన్‌కు మహేష్ బాబు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి