యూత్ స్టార్ నితిన్, మహానటి చిత్రంతో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్న కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'రంగ్ దే'. 'మిస్టర్ మజ్ను', 'తొలిప్రేమ' వంటి చిత్రాలతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. అదెలా అనుకుంటున్నారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్ర మూడో సింగిల్‌ని విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'నా కనులు ఎపుడు' అంటూ సాగే లిరికల్ సాంగ్‌తో మహేష్ గారు రంగ్ దే ప్రపంచంలోకి తీసుకెళతారని చెబుతూ.. దేవిశ్రీ సంగీత సారథ్యంలో.. సిద్ శ్రీరామ్ పాడుతున్న సాంగ్ ప్రోమోని చిత్రయూనిట్ వదిలింది. ఈ ప్రోమో చూస్తుంటే.. ఈ పాట సినిమాకి హైలెట్ అనేలా ఉండటమే కాకుండా ట్రెండ్ సెట్టర్ అయ్యే లక్షణాలు కూడా కనబడుతున్నాయంటూ.. నెజిటన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.