KAM ఆస్పత్రి ఘటన సుమోటోగా స్వీకరణ

ABN , First Publish Date - 2022-05-13T11:47:42+05:30 IST

ఫలక్‌నుమా శంషీర్‌గంజ్‌లోని కేఏఎం ఆస్పత్రిలో ఇంక్యుబేటర్‌

KAM ఆస్పత్రి ఘటన సుమోటోగా స్వీకరణ

  • విచారణ చేపట్టిన రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌


హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట : ఫలక్‌నుమా శంషీర్‌గంజ్‌లోని కేఏఎం ఆస్పత్రిలో ఇంక్యుబేటర్‌ వేడికి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీలోని వైద్యులు ఈ.అర్జున్‌, వి.జానకి గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. చిన్నారుల మృతికి కారణాలను తెలుసుకున్నారు. షీల్డ్‌ కవర్‌లో రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ వి.రాజలింగానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. ఎథిక్స్‌ కమిటీలోని సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని రాజలింగం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Read more