రాజస్థాన్ రాయల్స్ పై సన్‎రైజర్స్ గెలుపు

ABN , First Publish Date - 2020-10-23T04:42:59+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్‎తో జరిగిన మ్యాచ్‎లో హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది...

రాజస్థాన్ రాయల్స్ పై సన్‎రైజర్స్ గెలుపు

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్  రాజస్థాన్ రాయల్స్‎తో జరిగిన మ్యాచ్‎లో హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 155 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అయితే.. సన్ రైజర్స్ బ్యాటింగ్‎లో ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో మరోసారి విఫలమయ్యారు. ఇదే తరుణంలో వచ్చిన మనీశ్ పాండే (47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83) నాటౌట్, విజయ్ శంకర్ (51 బంతుల్లో 6 ఫోర్లతో 52) రన్స్ చేసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. హైదరాబాద్ జట్టు విజయంలో మనీష్ పాండే కీలక పాత్ర పోషించగా.. అతనికి తోడుగా విజయ్ శంకర్ కీలక ఇన్సింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.  రాజస్థాన్ బ్యాటింగ్ తొలుత బాగానే ఉన్నప్పటికీ చివర్లో లయ తప్పింది. 12 ఓవర్లలో 86/3తో బలంగా ఉన్నట్టు కనిపించిన రాజస్థాన్ ఆ తర్వాత వరుసపెట్టి వికెట్లు చేజార్జుకుంది. అదే సమయంలో హైదరాబాద్ బౌలర్లు, ముఖ్యంగా జానస్ హోల్డర్ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న సంజు శాంసన్ (36), స్టీవ్ స్మిత్ (19), రియాన్ పరాగ్ (20)లను పెవిలియన్ పంపాడు. డెత్ ఓవర్లలో పరుగులు పిండుకోవడంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా 154 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. రాబిన్ ఉతప్ప 19, బెన్ స్టోక్స్ 30, జోస్ బట్లర్ 9, రాహుల్ తెవాటియా 2 పరుగులు చేశారు. చివర్లో జోఫ్రా అర్చర్ 7 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 16 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది.

Updated Date - 2020-10-23T04:42:59+05:30 IST