అదరగొట్టిన సన్‌రైజర్స్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్.. చివరి ఓవర్‌లో..

ABN , First Publish Date - 2022-04-28T03:00:20+05:30 IST

ముంబై : Gujarat Titans vs Sunrisers Hyderabad లో తొలి బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, మిడిలార్డర్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్ అడెన్ మార్‌క్రమ్, చివర్లో సుశాంక్ సింగ్ మెరుపులతో హైదరాబాద్ 195 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌‌కు భారీ లక్ష్యా

అదరగొట్టిన సన్‌రైజర్స్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్.. చివరి ఓవర్‌లో..

ముంబై : Gujarat Titans vs Sunrisers Hyderabad మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, మిడిలార్డర్‌లో వచ్చిన అడెన్ మార్‌క్రమ్, చివర్లో సుశాంక్ సింగ్ మెరుపులతో హైదరాబాద్ 195 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలో 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా అభిషేక్ శర్మ, మార్‌క్రమ్ తిరిగి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చక్కటి భాగస్వామ్యంతో స్కోర్‌ను పరుగులు పెట్టించారు. వారిద్దరి భాగస్వామ్యం చూస్తే 200లకుపైగా టార్గెట్ నిర్దేశించడం ఖాయమనించింది. కానీ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో జట్టు స్కోరు 140 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాక స్కోరు నెమ్మదించింది. 147 పరుగుల వద్ద నికోలస్ పూరన్, 161 వద్ద మార్‌క్రమ్, 162 వద్ద వాషింగ్టన్ సుందర్ వరుసగా వికెట్లు కోల్పోయారు. అయితే గుజరాత్ పేసర్ ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్‌లో సుశాంక్ సింగ్ రెచ్చిపోయి ఆడాడు. ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టి ఓకే ఓవర్‌లో 25 పరుగులు రాబట్టాడు.


సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ(62), కేన్ విలియమ్సన్(5), రాహుల్ త్రిపాఠి(16), అడెన్ మార్‌క్రమ్(56), నికోలస్ పూరన్(3), వాషింగ్టన్ సుందర్(3 రనౌట్), సుశాంక్ సింగ్(25 నాటౌట్), మార్కో జాన్సన్(8 నాటౌట్)గా ఉన్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 3 వికెట్లు, యస్ దయాల్ 1, అల్జారీ జోసెఫ్ 1 చొప్పున వికెట్లు తీశారు.

Updated Date - 2022-04-28T03:00:20+05:30 IST