ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎండ ప్రచండం

ABN , First Publish Date - 2022-05-26T04:06:31+05:30 IST

భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎండ ప్రచండం
ఆసిఫాబాద్‌లో నిర్మానుష్యంగా మారిన రోడ్డు

- జిల్లాలో భానుడి ప్రతాపం

-  రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత్తలు

- ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి

- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

ఆసిఫాబాద్‌, మే 25: భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి. వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జిల్లాలో పది రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం 43డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా అవసరమైతేనే బయటకు రావాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తారస్థాయికి చేరుకొవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది నుంచి ఎండ చురుకుమంటోంది. 11గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటి నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల ద్వారా ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందు తున్నారు.  

43 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రత:

జిల్లాలో పగటి ఉష్ణోగ్రత గత పది రోజులుగా 42నుంచి 43డిగ్రీలు నమోదు కావడంతో నిప్పుల కొలిమిగా మారింది.  పది రోజుల నుంచి పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ఉదయం 10నుంచి 11గంటల మధ్య ఉష్ణోగ్రతలు 39నుంచి 40డిగ్రీల సెల్సీయస్‌ నమోదవుతోంది. మధ్యాహ్నం 12నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 43డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదపుతోంది. దినసరి కూలీలు, ప్రధానంగా ఉపాధిహామీ పనులు చేస్తున్న వారు ఎండ వేడిని తట్టు కోవడం కష్టంగా మారింది. సాయంత్రం అయిదు గంటల తరువాత కూడా వేడి తగ్గక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతలపానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో శీతలపానియా విక్రయాలు ఊపందుకుంన్నాయి.  

జిల్లాలో పది రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు

తేదీ గరిష్ట ఉష్ణోగ్రత

19న 41.5

20న     42

21న 42.6

22న 42.9

23న 41

24న 42.6

25న 43

జాగ్రత్తలు పాటించాలి

- డాక్టర్‌ సత్యనారాయణ, ఆసిఫాబాద్‌

వేసవిలో వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండ డంతో అవసరమైతే తప్ప బయట తిరగొద్దు. శారీరక శ్రమతో కూడిన పనులు చేయవద్దు. డీహైడ్రేషన్‌కు గురవ కుండా మంచినీటిని అధికంగా తీసుకోవాలి. కాటన్‌ దుస్తు లనే ధరించాలి. ఎండలో ప్రయాణించాల్సి వస్తే ముఖానికి రుమాలు కట్టుకోవాలి, టోపీలు, చలువ అద్దాలు, గొడుగు, హెల్మెట్‌ ధరించాలి. పంచధార, మజ్జిగ, నిమ్మరసం, ఉప్పు కలిపిన నీటిని తరుచూ తాగాలి. ఆరోగ్య సమస్యలు తలె త్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Updated Date - 2022-05-26T04:06:31+05:30 IST