Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 13:55:06 IST

Sunny Leone: నాతో కలిసి పనిచేయడం వాళ్లకి ఇష్టం లేదంటున్న సన్నీ.. కారణం మీదేనంటూ..

twitter-iconwatsapp-iconfb-icon

కెనడాలో పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగి.. అనంతరం బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి సన్నీ లియోన్ (Sunny Leone). 2012లో ‘జిస్మ్ 2’ మూవీతో బాలీవుడ్‌(Bollywood)కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సాధించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి నటిగా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని సాగిస్తోంది. అయితే.. ఆ జర్నీలో ఆమె చాలా ఆటుపోట్లని ఎదుర్కొన్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తాజాగా సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


సన్నీ మాట్లాడుతూ.. ‘2012లో మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పులు వచ్చాయి. నాకు ఇక్కడ ఉండడం చాలా ఇష్టం. ఐ లవ్ ఇండస్ట్రీ. పది సంవత్సరాలు కెరీర్‌లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. అయినా చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే.. ఆ చెడు నిర్ణయాల వల్ల చాలా మంచి విషయాలు నాకు తెలిశాయి. చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నాను. ఇదే నా ఇల్లు అని తెలుసుకున్నా. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి సెకనును ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను ఆదరించిన అభిమానులందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను.


అయితే.. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో నాతో పని చేయడానికి చాలామంది విముఖత చూపారు. అలాగే.. చాలామంది నాతో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ కూడా చూపించారు. కానీ.. పాపులర్ ప్రొడక్షన్ హౌస్‌లు(Production Houses), అక్కడి వ్యక్తులు ఇప్పటికీ నాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు. దానికి కారణం నా గత జీవితమే కావొచ్చు’ అని చెప్పుకొచ్చింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement