Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 02 Jan 2022 17:21:38 IST

Sunny Leone : ఆ గదిలో ఉన్నవాళ్లెవరూ... జరుగుతున్న దాన్ని ఆపేందుకు ముందుకు రాలేదు...

twitter-iconwatsapp-iconfb-icon
Sunny Leone : ఆ గదిలో ఉన్నవాళ్లెవరూ... జరుగుతున్న దాన్ని ఆపేందుకు ముందుకు రాలేదు...

బాలీవుడ్ యాక్ట్రస్ సన్నీ లియోన్ 2016 నాటి ఓ వివాదాస్పద ఇంటర్వ్యూ జ్ఞాపకం చేసుకుంది. అప్పట్లో ఆమెని ఒక సీనియర్ జర్నలిస్ట్ రకరకాల తప్పుడు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. ఆయన ఆమె గతం గురించి ఉద్దేశ్యపూర్వకంగా పలు ప్రశ్నలు సంధించాడు. అన్నీ సన్నీని నైతికంగా తక్కువ స్థాయిలో చూపేందుకు రాసుకొచ్చినవే! అయినా ఒక మాజీ పోర్న్ స్టార్‌గా తానేమీ అపరాధ భావంతో కుమిలిపోవటం లేదని ఆత్మస్థైర్యంతో సమాధానం చెప్పింది లియోన్. ఎంత ఇబ్బందికరంగా ప్రశ్నలు ఎదురైనా ఆమె మాత్రం ఇంటర్వ్యూ మధ్యలో ఆపలేదు. చివరిదాకా అన్ని ప్రశ్నలకి ధీటుగా జవాబులిస్తూ వచ్చింది... 


2016 నాటి దురదృష్టకర ఇంటర్వ్యూని తాజాగా సన్నీ లియోన్ మరోసారి గుర్తు చేసుకుంది. తనకి ఆ అనుభవం తరువాత మానసికంగా తేరుకోవటానికి చాలా రోజులు పట్టిందని ఆమె చెప్పింది. అయితే, తనని మాజీ పోర్న్‌ స్టార్‌గా ఆడియన్స్ ముందు నిలబెట్టి కించపరచాలని ప్రయత్నించిన జర్నలిస్టు కంటే అదే రూములో చోద్యం చూస్తూ కూర్చున్న జనం సన్నీని ఎక్కువగా బాధించారట! ‘‘ఆ గదిలో బోలెడు మంది వరుసలుగా వేసిన కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వాళ్లెవరూ ఇంటర్వ్యూని ఆపే ప్రయత్నం చేయలేదు’’ అంది సన్నీ. ఇంటర్వ్యూ చేస్తోన్న వ్యక్తి అడగకూడని ప్రశ్నలు ఒకటి తరువాత ఒకటి గుప్పిస్తోన్నా కూడా అందరూ చూస్తూ ఉండిపోయారు. ఎవరూ తమ నిరసన తెలపలేదు. వాళ్లు అలా ప్రవర్తించటం సన్నీ లియోన్‌ని తీవ్రంగా బాధించిందట.


ఒకప్పుడు అడల్ట్ ఫిల్మ్స్‌లో నటించిన సన్నీ బాలీవుడ్‌కి వచ్చాక ఆచితూచి సినిమాలు చేస్తూ తనని తాను నటిగా నిరూపించుకుంటోంది. అయితే, ఆమెకి ఇప్పటికీ హాట్ స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్సే ఎదురవుతున్నాయి. ఈ మధ్య చేసిన ఓ ప్రైవేట్ వీడియో సాంగ్ లిరిక్స్ కారణంగా వివాదాస్పదం అయింది. బృందావనం, మథురలోని కృష్ణ భక్తులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి కూడా సన్నీ లియోన్ సహా అందరి మీదా చర్యలు తీసుకుంటామన్నారు. దిగి వచ్చిన సాంగ్ ప్రొడక్షన్ కంపెనీ లిరిక్స్ ఛేంజ్ చేస్తామని హామీ ఇచ్చింది. వివాదం సంగతెలా సన్నీ లియోన్ మాత్రం లెటెస్ట్ హాట్ సాంగ్‌లో మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకుల గుండెలకి గాయాలు చేసింది... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement