కోవిడ్ తో మరణించిన ఉద్యోగులకు తక్షణమే సహాయం అందించాలి

ABN , First Publish Date - 2022-07-04T21:52:06+05:30 IST

కరోనా మహ్మమ్మారి కారణంగా మరణించిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు అంగన్వాడి టీచర్లకు ఆర్ధిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని(smruti irani) తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి(sunita laxma reddy) కోరారు

కోవిడ్ తో మరణించిన ఉద్యోగులకు తక్షణమే సహాయం అందించాలి

హైదరాబాద్: కరోనా మహ్మమ్మారి కారణంగా మరణించిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు అంగన్వాడి టీచర్లకు ఆర్ధిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని(smruti irani) తెలంగాణ మహిళా కమిషన్(telangana mahila comission) ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి(sunita laxma reddy) కోరారు.భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, లక్షద్వీప్ రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన పలు అంశాలను విన్నవించారు.


కోవిడ్-19 మహమ్మారి సమయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన అంగన్‌వాడి టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి వీలైనంత త్వరగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని త్వరగా అందేలా చూడాలని కోరారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమాయోజన (PMJJBY) పరిధిలోకి వచ్చే అంగన్‌వాడి టీచర్లు, మినీ అంగన్‌వాడి టీచర్లు, అంగన్‌వాడి హెల్పర్‌ల పెండింగ్ క్లెయిమ్‌లను కూడా వెంటనే చెల్లించాలన్నారు. 


అలాగే PMJJBY కింద తెలంగాణ రాష్ట్రంలోని P&GS యూనిట్‌లలో ప్రాసెస్ చేయడం కోసం LIC ఆఫ్ ఇండియాకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్ధం లక్ష్మి, కటారి రేవతి, కమిషన్ సెక్రటరీ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T21:52:06+05:30 IST