2 టెలికాం సంస్థలే మిగిలేటట్టైతే అది విచారకరమే: సునీల్ మిట్టల్

ABN , First Publish Date - 2021-06-24T05:18:10+05:30 IST

భారత్ వంటి పెద్ద దేశంలో కనీసం మూడు టెలికాం సంస్థలు ఉండాలని ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ తాజాగా వ్యాఖ్యానించారు.

2 టెలికాం సంస్థలే మిగిలేటట్టైతే అది విచారకరమే: సునీల్ మిట్టల్

ముంబై: భారత్ వంటి పెద్ద దేశంలో కనీసం మూడు టెలికాం సంస్థలు ఉండాలని  ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ తాజాగా వ్యాఖ్యానించారు. భారత్‌లో టెలికాం రంగలోని పరిస్థితులపై ఆయన కటార్‌లో జరిగిన ఎకనమిక్ ఫారంలో ప్రసంగించారు. ‘‘ఒకప్పుడు భారత్‌లో 12 టెలికాం సంస్థలు ఉండేవి. నేడు వాటి సంఖ్య రెండున్నరకు దిగజారింది. చివరికి ఇది రెండుకు చేరుకుంటుందా..? ఏమో..నా దృష్టిలో మాత్రం అది చాలా విచారకరం’’ అని మిట్టల్ కామెంట్ చేశారు. అయితే..మార్కెట్‌లో ఎయిర్‌టెల్ చాలా బలమైన స్థానంలో ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఆరంగేట్రంతో భారత టెలికాం రంగం స్వరూపస్వభావాలు మారిపోయిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-24T05:18:10+05:30 IST