కాంగ్రెస్‌కు సునీల్‌ జక్కర్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-05-15T07:22:58+05:30 IST

కాంగ్రెస్‌ బలోపేతం కోసం చింతన్‌ శిబిర్‌ను నిర్వహిస్తున్న వేళ ఆ పార్టీ సీనియ ర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జక్కర్‌ ‘‘గుడ్‌లక్‌, గుడ్‌బై కాంగ్రెస్‌’’ అని ప్రకటించారు.

కాంగ్రెస్‌కు సునీల్‌ జక్కర్‌ గుడ్‌బై

ఛండీగఢ్‌, మే 14: కాంగ్రెస్‌ బలోపేతం కోసం చింతన్‌ శిబిర్‌ను నిర్వహిస్తున్న వేళ ఆ పార్టీ సీనియ ర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జక్కర్‌ ‘‘గుడ్‌లక్‌, గుడ్‌బై కాంగ్రెస్‌’’ అని ప్రకటించారు. 68 ఏళ్ల జక్కర్‌ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీలో అన్ని బాధ్యతల నుంచి అధిష్ఠానం గత నెలలోనే తప్పించింది. తన ఫేస్‌బుక్‌ పేజీలో కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ కార్యక్రమం లైవ్‌ ప్రసారం అవుతున్నప్పుడే పార్టీని వీడుతున్నట్టు జక్కర్‌ ప్రకటించారు. పార్టీ నుంచి ఇటీవల రాజీనామా చేసిన అమరీందర్‌సింగ్‌, అశ్వని కుమార్‌, ఆర్‌పీఎన్‌ సింగ్‌ వంటి నేతల వరుసలో జక్కర్‌ చేరడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-05-15T07:22:58+05:30 IST