సుంకాల భారం తగ్గించాలి : మిట్టల్‌

ABN , First Publish Date - 2020-08-01T08:17:45+05:30 IST

టెలికాం రంగంపై అధిక పన్నులు, సుంకాల భారం తగ్గించాలని, ప్రభుత్వం ఈ రంగాన్ని ఖజానా నింపే వనరుగా భావించకూడదని టెలికాం దిగ్గజం సునీల్‌ భారతి మిట్టల్‌ అన్నారు.

సుంకాల భారం తగ్గించాలి : మిట్టల్‌

టెలికాం రంగంపై అధిక పన్నులు, సుంకాల భారం తగ్గించాలని, ప్రభుత్వం ఈ రంగాన్ని ఖజానా నింపే వనరుగా భావించకూడదని టెలికాం దిగ్గజం సునీల్‌ భారతి మిట్టల్‌ అన్నారు. ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం టెలికాం నెట్‌వర్క్‌, మొబైల్‌ డివై్‌సలు, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో మరింత విలువ జోడింపు జరగాలనేందుకు మేలుకొలుపు అని ఆయన చెప్పారు. భారత టెలికాం రంగం పరివర్తన చరిత్ర ప్రపంచంలో ఏ దేశంతోనూ సరిపోల్చలేనిదని, 25 సంవత్సరాల కాలంలో భారత్‌ ఎన్నో రంగాల్లో పురోగమించేందుకు ఇది దోహదపడిందని ఆయన అన్నారు. ఇప్పుడు భారత కస్టమర్లు ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో నెలకి 15 జీబీ డేటా వినియోగించుకుంటున్నారని మిట్టల్‌ తెలిపారు. 

Updated Date - 2020-08-01T08:17:45+05:30 IST