Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 28 Jan 2022 19:29:22 IST

పెళ్లి పుకార్లపై స్పందించిన అహాన్ శెట్టి.. ఏమని చెప్పాడంటే..

twitter-iconwatsapp-iconfb-icon
పెళ్లి పుకార్లపై స్పందించిన అహాన్ శెట్టి.. ఏమని చెప్పాడంటే..

సునీల్ శెట్టి కుటుంబంలో రెండు వివాహాలు జరుగనున్నాయని కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌లో పుకార్లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి, కూతురు అతియా శెట్టి పెళ్లిళ్లు త్వరలోనే జరగనున్నాయని వదంతులు షికార్లు కొట్టాయి. తాజాగా ఈ గాసిప్స్‌పై సునీల్ శెట్టి వారసుడు అహాన్ శెట్టి స్పందించాడు. కొన్ని రోజుల క్రితమే అతడు ‘తడప్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. 


అహాన్ శెట్టి గత కొంతకాలంగా తానియా ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తున్నాడు. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కూడా కేఎల్.రాహుల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, కొడుకు అహాన్ శెట్టి వివాహాలు 2022లో జరుగనున్నాయని బీ టౌన్ మీడియా తెలిపింది. ఆ పుకార్లను సునీల్ శెట్టి ఖండిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. తాజాగా అహాన్ శెట్టి కూడా ఆ గాసిప్స్‌పై స్పందించాడు. ‘‘మా కుటుంబం ఇంతవరకు ఎటువంటి విషయాన్ని దాచిపెట్టలేదు. అన్ని విషయాల్లో నిజాయితీగా వ్యవహరించింది. నేను స్క్రీన్‌పై కనిపించినప్పుడు ప్రేక్షకులు అభిమానించాలంటే నిజాయితీగా ఉండాలి. రియల్ లైఫ్‌లోను ఎటువంటి విషయాలను దాచిపెట్టకూడదు. నేను పెళ్లి చేసుకొబోతున్నాననే విషయంలో నిజం లేదు. అందువల్ల ఆ పుకార్లు నన్ను బాధించలేదు. ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఆరంభించాలనే ఆలోచన నాకు లేదు. కెరీర్ మీద మాత్రమే దృష్టి సారించాను. త్వరలో చేయబోయే సినిమాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అని అహాన్ శెట్టి చెప్పాడు. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...