కరోనా.. విజృంభణ

ABN , First Publish Date - 2020-06-01T10:51:34+05:30 IST

గ్రేటర్‌లో కరోనా విజృంభిసోంది. ఆదివారం ఒక్కరోజే 122 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 100 సంఖ్య దాటడం ఇదే మొదటిసారి. మే నెల 29న నమోదైన 82 కేసుల రికార్డును ఆదివారం

కరోనా.. విజృంభణ

గ్రేటర్‌లో ఆదివారం అత్యధిక కేసులు


హయత్‌నగర్‌/ అల్వాల్‌/ బౌద్ధనగర్‌/ రామంతాపూర్‌/మంగళ్‌హాట్‌/ ఖైరతాబాద్‌/ బంజారాహిల్స్‌/ఏఎస్‌రావునగర్‌/మెహిదీపట్నం/ముషీరాబాద్‌/ఎల్‌బీనగర్‌/పహాడీషరీఫ్‌/చాదర్‌ఘాట్‌/రాంనగర్‌/బర్కత్‌పుర/మారేడ్‌పల్లి/అఫ్జల్‌గంజ్‌/మారేడుపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి):  గ్రేటర్‌లో కరోనా విజృంభిసోంది. ఆదివారం ఒక్కరోజే 122 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 100 సంఖ్య దాటడం ఇదే మొదటిసారి. మే నెల 29న నమోదైన 82 కేసుల రికార్డును ఆదివారం నమోదైన వైరస్‌ కేసుల సంఖ్య అధిగమించింది. మే నెలలో మొత్తం 1,015 కేసులు (మే 27 మినహాయించి) నమోదయ్యాయి. 


కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో 63మందికి..

 కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో 63మందికి నిర్ధారణ అయింది. ఆదివారం ఓపీలో 97మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 22మంది రక్త నమూనాలు సేకరించారు. నెగెటివ్‌ వచ్చిన 23మందిని డిశ్చార్జి చేశారు. 


గర్భిణి నుంచి ఆమె తల్లికి..

బాలాపూర్‌ లెనిన్‌నగర్‌కు చెందిన గర్భిణి నుంచి ఆమె తల్లికి వైరస్‌ సోకింది. గర్భిణి (25) గత నెల 18న ప్రసవం కోసం ఇంజాపూర్‌లోని పుట్టింటికి వచ్చింది. 25న ఆమె జడ్జిఖానా ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. బాలింతకు కరోనా సోకడంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలో ఉంచారు. కూతురితో పాటు ఉన్న తల్లి(43)కి వైరస్‌ సోకింది. ఇంజాపూర్‌లో బాలింత తండ్రి, సోదరి రక్తనమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. 


కానిస్టేబుల్‌ తండ్రికి.. 

అల్వాల్‌లో కరోనా బారిన పడిన కానిస్టేబుల్‌ తండ్రికి ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానిస్టేబుల్‌ నుంచి అతడి తండ్రి(61)కి కరోనా సోకినట్లు తేలడంతో అతడినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


మరణించిన వ్యక్తి కుటుంబంలో.. 

సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బషీర్‌బాగ్‌లో బంగారు నగల వ్యాపారి(84) మూడు రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. అతడి కుమారుడి(60)కి వైద్య పరీక్షలు చేయగా, ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


దూద్‌బావిలో యువకుడికి.. 

చిలకలగూడ దూద్‌బావిలో రెండో కరోనా కేసు నమోదైంది. స్థానిక యువకుడి(25)కి పాజిటివ్‌ వచ్చింది.


‘ఉస్మానియా’ హౌస్‌ సర్జన్‌కు..  

ఉస్మానియా ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌గా చేస్తున్న రామంతాపూర్‌ ప్రగతినగర్‌కు చెందిన వైద్యుడు పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది.


వృద్ధురాలికి.. 

మంగళ్‌హాట్‌ సీతారాంబాగ్‌కు చెందిన వృద్ధురా లు(75) గత నెల 30న అనారోగ్యానికి గురైంది. గాంధీ ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించా రు. ఆ ఇంట్లోని పదిమందిని హోం క్వారంటైన్‌ చేశారు. 


ఏఎ్‌సరావునగర్‌లో మరో పాజిటివ్‌..

నాలుగు రోజుల క్రితం కమలానగర్‌లోని ఓ వృద్ధురాలి(82)కి వైరస్‌ సోకగా తాజాగా అదే కాలనీకి చెందిన ఓ వ్యాపారి(47)కి పాజిటివ్‌ వచ్చింది. 


ఏపీ సచివాలయ ఉద్యోగికి...

 ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి(40) ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ముషీరాబాద్‌ నుంచి విధుల కోసం ఏపీ సచివాలయానికి వెళ్ల గా వారు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిం ది. అక్కడే వైద్యం అందిస్తున్నట్లు భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ డాక్టర్‌ మౌనిక తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు పది మందిని హోం క్వారంటైన్‌ చేశారు. 


దిల్‌సుఖ్‌నగర్‌లో ఇద్దరికి..

దిల్‌సుఖ్‌నగర్‌ దుర్గానగర్‌కు చెందిన మహిళ(53) ఆపోలో ఆస్పత్రిలో కేన్సర్‌కు చికిత్స చేయించుకుంటోంది. ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. గత మంగళవారం ఎన్‌టీఆర్‌నగర్‌ ఫేజ్‌-1కు చెందిన పండ్ల వ్యాపారి(35)కి పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. అతని వదిన(30)కు ఆదివారం పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.


మలక్‌పేటలో ఆరుగురికి..

మలక్‌పేటలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉస్మాన్‌పురలో వస్త్ర వ్యాపారికి అతని భార్యకు శనివారం పాజిటివ్‌ రావడంతో ఇతనితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న నలుగురికి పరీక్షల నిర్వహించగా ముగ్గురికి వైరస్‌ సోకింది. ముసారాంబాగ్‌ వెస్ట్‌ ప్రశాంత్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌(25)కు ముసారాంబాగ్‌కు చెందిన  అగ్నిమాపక దళం కానిస్టేబుల్‌(33)కు, ఓల్డ్‌మలక్‌పేటలోని ఓవైసీ గ్రౌండ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి, మాదన్నపేట కూరగాయల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి(33)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


జెమిని కాలనీలో ఒకరికి, మేదర బస్తీలోనూ ఇద్దరికి..

 రెడ్డి ల్యాబ్‌లో పనిచేస్తూ జెమిని కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి(28)కి ఆదివారం పాజిటివ్‌ వచ్చింది. రాంనగర్‌ మేదర బస్తీలో హోటల్‌ యజమాని ఇంట్లో మహిళ ప్రైమరీ కాంటాక్ట్‌లో ఆమె కూతురి(26)కి, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తి(45)కి పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన జెమిని కాలనీ, మేదర బస్తీని కట్టడి చేశారు.


కాచిగూడలో మహిళకు..

కాచిగూడ డివిజన్‌లోని కుద్బీగూడలో మహిళ(50)కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాంధీకి తరించారు. 


ఫీవర్‌ ఆస్పత్రికి నాలుగు అనుమానిత కేసులు 

ఫీవర్‌ ఆస్పత్రిలో ఆదివారం నాలుగు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారినుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 


కార్ఖానాలో ఒకే కుటుంబంలో నలుగురికి..

సికింద్రాబాద్‌ కార్ఖానాలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ నలుగురినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


షాహినాథ్‌గంజ్‌లో నలుగురికి..

 షాహినాథ్‌గంజ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. గోషామహల్‌ జిన్సి చౌరస్తాకు చెందిన వ్యక్తి(27)కి నిర్ధారణ అయింది. గాంధీలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. గోడేకికబర్‌ బస్తీకి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ అని తేలింది. ఇతని బంధువులు మహిళ(47), భర్త(52), కొడుకు(14) రక్త నమూనాలను గాంధీలో పరీక్షించగా ముగ్గురికీ పాజిటివ్‌ వచ్చింది. 


సరోజిని లో 25 మంది అనుమానితులు

మెహిదీపట్నం సరోజినిదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసులేషన్‌ వార్డులో ఆదివారం 25 మంది అనుమానితులు ఉన్నట్లు డాక్టర్‌ అనురాధ తెలిపారు. కరోనా లక్షణాలు ఉండడంతో నగరంలోని ఆయా ప్రాంతాలకు చెందిన వారు ఈ ఐసులేషన్‌లో ఉన్నట్లు డాక్టర్‌ అనురాధ తెలిపారు. 


 జియాగూడ డివిజన్‌లో 20 మందికి...

జియాగూడలోని నవోదయ బస్తీకి చెందిన మహిళ(45)కు ఇటీవల పాజిటివ్‌ వచ్చింది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌ చేశారు. వారి రక్త నమూనాలను సేకరించి గాంధీకి పంపించారు. ఆదివారం ఆ మహిళ కుటుంబ సభ్యుల్లో  వ్యక్తి (48), యువకుడు(21), యువకుడు(22), యువకుడు(23), మహిళ(42), యువతి(15), బాలిక (12), మహిళ (34), యువతి (19) మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అందరినీ వైద్య పరీక్షల నిమితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సబ్జిమండి ప్రాంతంలోని వ్యక్తి(45), ఇంకో వ్యక్తి(54), వ్యక్తి (86), యువకుడు (13), వ్యక్తి (32), యువతి (13)కి పాజిటివ్‌ వచ్చింది. గంగానగర్‌లో వృద్ధుడి(70)కి, భీంనగర్‌ ప్రాంతానికి చెందిన మహిళ(37), రంగనాథ్‌నగర్‌లో వ్యక్తి(38), న్యూ శాంతినగర్‌కు చెందిన మహిళ(35)లకు కరోనా నిర్ధారణ అయింది. లోనికర్గీల్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌(30)కు పాజిటివ్‌ వచ్చింది. బస్తీల్లో పాజిటివ్‌ వ్యక్తులను హోంక్వారంటైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కుల్సుంపురా డివిజన్‌ పరిధిలోని అన్ని దుకాణాలను మూసివేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 

 

వైరస్‌ సోకి నలుగురి మృతి

ఖైరతాబాద్‌ సర్కిల్‌లో కరోనాతో ఆదివారం ఇద్దరు మృతి చెందారు. గాంధీనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి(72) అపోలో ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఆదివారం మృతి చెందాడు. ఆనంద్‌నగర్‌  కాలనీకి చెందిన  వృద్ధు డు(60) ఐదు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం చనిపోయాడు.  మలక్‌పేటలో వృద్ధుడు(73) కరోనాతో మృతి చెందాడు.


 ఆర్టీసీ కండక్టర్‌..

గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి(40) కంటోన్మెంట్‌ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌(40)గా పనిచేస్తున్నాడు.  ఆయన అస్వస్థతకు గురికాగా వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తెలింది. దాంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

 

13 మంది కానిస్టేబుళ్లకు

తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు ఆదివారం పాజిటివ్‌ వచ్చింది. శనివారం నగరంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది రక్త నమూనాలను గగన్‌మహల్‌లో సేకరించారు. ఆదివారం వచ్చిన రిపోర్ట్‌లో లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో పనిచేసే ఓ హెడ్‌కానిస్టెబుల్‌కు, మంగళ్‌హట్‌, కుల్పుంపుర, బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లలో పనిచేసే ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరితో కలిసి పనిచేసిన ఇతర సిబ్బందిని పోలీసులు క్వారంటైన్‌ చేశారు. 


మంగళ్‌హాట్‌లో ఒకరికి ..

మంగళ్‌హాట్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తూ లంగర్‌హౌజ్‌ ప్రశాంత్‌ నగర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్‌కు వైరస్‌ నిర్ధారణ అయ్యింది. కానిస్టేబుల్‌ను ఆదివారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లంగర్‌హౌజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌(52)కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


ఎల్‌బీనగర్‌లో ఒకరికి..

ఎల్‌బీనగర్‌ భరత్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌(28)కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని కట్టడి చేసి సంబంధీకులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


బీఎన్‌రెడ్డినగర్‌లో..

బీఎన్‌రెడ్డినగర్‌ సర్కిల్‌ పరిధిలోని చైతన్యనగర్‌కు చెందిన కానిస్టేబుల్‌(43) చార్మినార్‌ పీఎ్‌సలో పనిచేస్తున్నారు. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది.  


జియాగూడలో..

 జియాగూడలోని కర్గీల్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌(30)కు పాజిటివ్‌ వచ్చింది. 


పహాడిషరీ్‌ఫలో 21 మందికి...

పహడీషరీ్‌ఫలో వారం క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారిలో 32 మందికి  శనివారం పరీక్షలు చేయగా వారిలో 21 మందికి ఆదివారం పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు పహాడీషరీ్‌ఫలో జరిగిన విందుతో లింక్‌ ఉన్న 60 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో సంవత్సరం వయసున్న పిల్లలతో పాటు 70 సంవత్సరాల వృద్ధుల వరకు ఉన్నారు. పహడీషరీ్‌పలోని 114 ఇళ్లను కట్టడి చేశారు.

Updated Date - 2020-06-01T10:51:34+05:30 IST