ఆదివారం ఆగని జనం

ABN , First Publish Date - 2021-05-17T05:41:06+05:30 IST

జిల్లాలో ఆదివారం లాక్‌డౌన్‌ సడలింపు సమయం లో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. జిల్లాకేంద్రంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, నందిపే ట తదితర పట్టణాల్లో ప్రజల రద్దీ కనిపించింది. ఆది వారం కావడంతో మటన్‌, చికెన్‌, చేపల కొనుగోలుకు ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చారు.

ఆదివారం ఆగని జనం
ఆదివారం ఉదయం కిక్కిరిసిన నగరంలోని వీక్లీ మార్కెట్‌

జిల్లాలో ఆదివారం పెరిగిన రద్దీ
చికెన్‌, మటన్‌, చేపల దుకాణాల వద్ద బారులు తీరిన ప్రజలు

నిజామాబాద్‌అర్బన్‌, మే 16: జిల్లాలో ఆదివారం లాక్‌డౌన్‌ సడలింపు సమయం లో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. జిల్లాకేంద్రంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, నందిపే ట తదితర పట్టణాల్లో ప్రజల రద్దీ కనిపించింది. ఆది వారం కావడంతో మటన్‌, చికెన్‌, చేపల కొనుగోలుకు ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆయా దుకాణాల వ ద్ద బారులు తీరారు. ఎక్కడా ప్రజలు భౌతికదూరం పాటించలేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించలేదు. భౌతిక దూరం పాటించాలని దుకాణదారులు సైతం ఎవరికి చెప్పకపోవడంతో దుకాణాల వద్ద గుమిగూడి మరీ ప్రజలు మాంసం, చేపలు కొనుక్కెళ్లారు.
5వ రోజు ప్రశాంతంగా లాక్‌డౌన్‌
కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ 5వ రోజు జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. మిగ తా సమయాల్లో అత్యవసరమయితే తప్ప రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నా యి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వె ళ్లేందుకు ప్రజలు ఆసక్తిని చూపించడంలేదు. మండలస్థాయిల్లో పోలీసులు రహదారులపై బందోబస్తు ని
ర్వహిస్తుండడంతో
వాహనదారులు బయటకు రావడంలేదు. బ స్సులు సైతం ఉదయమే న డుస్తుండడంతో ప్రజల రద్దీ అం తగా ఉండడంలే దు. దుకాణాదారులు కూడా ఉదయం 10గం టలకే దుకాణానలు మూసివేస్తున్నారు.
తగ్గుతున్న కరోనా కేసులు  
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌ న్‌ నిర్ణయం వల్ల జిల్లాలో కరోనా కేసులు రోజురోజు కూ తగ్గుముఖం పడుతున్నాయి. వైద్య బృందాలు సై తం ప్రతీ గ్రామం, పట్టణాల్లో సర్వే నిర్వహించి ల క్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేస్తుండడంతో జిల్లా లో కరోనా పాజిటివ్‌ కేసులు గతంలో కంటే తక్కువ గా నమోదవుతున్నాయి. వారం క్రితం జిల్లాలో 600ల  వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గత 5 రోజులుగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ చర్యల వల్ల ప్ర జలు అంతంతమాత్రంగానే బయటకి వెళ్తుండడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 12న జిల్లాలో 255 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 13వ తేదీన 248, 14న 200లు, 15న 214, ఆదివారం జిల్లావ్యాప్తంగా కేవలం 124 పాజిటివ్‌ కేసులు మాత్ర మే నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులు తగ్గడానికి టె స్టుల సైతం తగ్గించడం ఒక కారణం కాగా.. లాక్‌డౌన్‌ కూడా కరోనా వ్యాప్తిని కొంతమేర తగ్గిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-17T05:41:06+05:30 IST