Abn logo
Aug 11 2020 @ 00:19AM

ఆదివారం... అర్థరాత్రి... మర్రిచెట్టు కింద!

గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రోజూ గిల్లే వాడు’ (ఆర్జీవీ). వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సమర్పణలో బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో లిరికల్‌ సాంగ్‌ను ఆదివారం, అర్థరాత్రి, మణికొండ మర్రిచెట్టు కింద రవిశంకర్‌ కంఠమనేని విడుదల చేశారు. తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమనే అవమానిస్తున్న ‘తగుల్భాజీ దర్శకదయ్యం’ ‘నమక్‌ హ రాం’ఘోపాలవర్మకి ఈ పాటని అంకితం ఇచ్చినట్లు జొన్నవిత్తుల తెలియచేశారు. చిత్ర సమర్పకుడు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం మాట్లాడుతూ ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. సురేశ్‌, రాశి, శ్రద్థా దాస్‌, అమిత్‌, తేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వీణాపాణి. 


Advertisement
Advertisement
Advertisement