Advertisement
Advertisement
Abn logo
Advertisement

అటు Tankbundపై.. ఇటు చార్మినార్ వద్ద Sunday ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ట్యాంక్‌బండ్‌పై సండే.. ఫన్‌డేకు విశేష స్పందన లభిస్తోంది. ఈ వారం కూడా అత్యధిక సంఖ్యలో కుటుంబసమేతంగా ఆహ్లాదంగా గడిపారు. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి సీపీ అంజనీకుమార్‌ హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో ఒక పోలీస్‌ అనే నినాదంతో వికాప్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, దీనికి మంచి స్పందన లభించిందని అన్నారు. నగర పోలీసు కమిషనర్‌ సతీమణి వసుంధర మాట్లాడుతూ, హెచ్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో  ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఆందరూ తప్పక ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వారం సాదాసీదాగా..

పదిహేను రోజులకోసారి చార్మినార్‌ వద్ద నిర్వహిస్తున్న ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌ ఈ వారం సాదాసీదాగా జరిగింది. మొదటిసారి పోలీస్‌ బ్యాండ్‌తో పాటు మూషాయిరా కార్యక్రమాలు, రెండోసారి బిగ్‌ బాక్సింగ్‌, ఖవ్వాలీలతో జోరుగా సాగింది. మసీదులు, దేవాలయాలు ఉన్న చార్మినార్‌ వద్ద సండే ఫండే లాంటి కార్యక్రమాలు వద్దని కొన్ని సంస్థలు అభ్యంతరం తెలపడంతో పాటు, కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ వారం సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా సాగింది. 23 స్టాళ్లను ఏర్పాటు చేశామని, సందర్శకులకు ముగ్గురు కళాకారులు ఉచితంగా టాటూలు వేయగా, మరో ముగ్గురు కేరికేచర్‌ ఆర్టిస్టులు పెన్సిల్‌ ద్వారా కావాల్సిన వారికి పెయింటింగ్‌ వేసి ఇచ్చారని కులీ కుతుబ్‌ షా అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ  కార్యదర్శి గురువీర తెలిపారు. చార్మినార్‌ చుట్టూ రంగురంగుల దీపాలతో అలంకరించామన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement