Aug 1 2021 @ 16:41PM

ఆగస్ట్ 13న ‘సుందరి’

హీరోయిన్‌ పూర్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘సుంద‌రి’. అర్జున్ అంబ‌టి హీరోగా న‌టిస్తున్నారు. క‌ళ్యాణ్ జి గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో జరిగిన పాత్రికేయుల స‌మావేశంలోహీరోయిన్ పూర్ణ, హీరో అర్జున్, రాకేందు మౌళి, నిర్మాత   రిజ్వాన్, దర్శకుడు కళ్యాణ్ జి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఖుషి పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా పూర్ణ మాట్లాడుతూ ‘‘ఆగ‌స్ట్ 13న మా సుంద‌రి సినిమా రిలీజ్ అవుతుంది. నేను పెద్ద హీరోయిన్‌ను కాక‌పోయినా నాపై న‌మ్మ‌కంతో ఓ టైటిల్ రోల్ మూవీలో నాకు అవ‌కాశం ఇచ్చారు. న‌య‌న‌తార‌గారిని రోల్ మోడ‌ల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్‌గారి వ‌ర్క్ చూసి షాక‌య్యాను. ఆయ‌న‌తో మ‌రో సినిమాను కూడా చేయ‌బోతున్నాను. మంచి కంటెంట్‌తో విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాన‌ని నిర్మాత రిజ్వాన్ తెలిపారు. ట్రైల‌ర్ చూసి క‌థ‌ను ఎన్ని విధాలుగా ఊహించుకున్నా.. క‌థ మ‌రోలా ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ గోగ‌ణ తెలిపారు. పూర్ణ బెస్ట్ పెర్ఫామ‌ర్ అని హీరో అర్జున్ అంబ‌టి, రాకేందు మౌళి అన్నారు.