Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 25 Jan 2022 00:29:54 IST

సుందరం సందడి

twitter-iconwatsapp-iconfb-icon
సుందరం సందడి

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. నజ్రియా ఫహద్‌ కథానాయిక. మైత్రీ మూవీస్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వై నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ‘‘ఈ సంవత్సరం రోలర్‌ కోస్టర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తయింది’’ అంటూ నాని సెట్స్‌లో చివరి రోజు చిత్రీకరించిన ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్‌ అనే పాత్రలో కనిపించనున్నారు. ‘‘సంపూర్ణ వినోదాత్మక చిత్రమిది. టైటిల్‌లోనే కాదు, సినిమాలోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు దర్శక నిర్మాతలు. నదియా, హర్షవర్థన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు నటిస్తున్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International