మౌంట్‌ ఎల్బర్ట్‌ పర్వతంపై సూర్యనమస్కారాలు

ABN , First Publish Date - 2022-08-08T06:36:33+05:30 IST

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామానికి మరిపల్లి ప్రవీణ్‌ కొలరాడోలోని మౌంట్‌ ఎల్బర్ట్‌ పర్వతంపై 108 సూర్య నమస్కారాలు చేసి అబ్బురపరిచాడు.

మౌంట్‌ ఎల్బర్ట్‌ పర్వతంపై సూర్యనమస్కారాలు
పర్వతంపై సూర్య నమస్కారాలు చేస్తున్న ప్రవీణ్‌

వెల్లుల్ల యువకుడి ఘనత

మెట్‌పల్లి రూరల్‌, ఆగస్టు 7 : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామానికి మరిపల్లి ప్రవీణ్‌ కొలరాడోలోని మౌంట్‌ ఎల్బర్ట్‌ పర్వతంపై 108 సూర్య నమస్కారాలు చేసి అబ్బురపరిచాడు. ప్రవీణ్‌ జూలై 20న బయలుదేరి ఆగస్టు 7న కొలరాడోలోని మౌంట్‌ ఎల్బర్ట్‌ పర్వతాన్ని అధిరోహించాడు. పర్వతంపై 33 నిమిషాల్లో 108 సూర్య నమాస్కారాలను చేశాడు. ఇప్పటి వరకు ప్రవీణ్‌ 20 ఎత్తైనపర్వతాలను ఆధిరోహించాడు.


Updated Date - 2022-08-08T06:36:33+05:30 IST