Abn logo
Oct 24 2020 @ 01:05AM

సన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైంది

Kaakateeya

మోహన్‌బాబు కథానాయకుడిగా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో ప్రారంభమైంది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. మోహన్‌బాబు కథ అందిస్తున్న ఈ చిత్రానికి ఆయన కోడలు విరానికా స్టైలిస్ట్‌గా పనిచేస్తుండడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి విరానికా మంచు, ఐరా, అవ్రమ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, లక్ష్మీ మంచు, విద్యా నిర్వాణ క్లాప్‌ ఇచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా డైరెక్షన్‌ టీమ్‌కు స్ర్కిప్ట్‌ అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చాలాకాలం తర్వాత మోహన్‌బాబుగారు నటిస్తున్న దేశభక్తి చిత్రమిది. ఇందులో ఆయన మునుపెన్నడూ కనిపించని బలమైన పాత్రలో కనిపిస్తారు. కథతోపాటు ఇళయరాజా సంగీతం, సర్వేష్‌ మురారి కెమెరా పనితనం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని అన్నారు. ఏకధాటిగా చిత్రీకరణ చేస్తామని నిర్మాత మంచు విష్ణు తెలిపారు.

Advertisement
Advertisement