భానుడి భగభగలు

ABN , First Publish Date - 2022-05-27T05:40:17+05:30 IST

ఇటీవల మంగళవారం కురిసిన అకాల వర్షానికి వాతావరణం చల్లబడింది. బుధవారం ప్రజలందరూ ఊరట చెందారు. ఒకరోజు గడిచిందో లేదో గురువారం భానుడి భగభగలు కనిపించాయి.

భానుడి భగభగలు
ముదినేపల్లిలో బస్టాండ్‌ నిర్మానుష్యం

ముదినేపల్లి, మే 26 : ఇటీవల మంగళవారం కురిసిన అకాల వర్షానికి వాతావరణం చల్లబడింది. బుధవారం ప్రజలందరూ ఊరట చెందారు. ఒకరోజు గడిచిందో లేదో గురువారం భానుడి భగభగలు కనిపించాయి. ఎండ నిప్పులు చెరిగింది. వడగాల్పులు వీచాయి. ముదినేపల్లిలో 42 డిగ్రీలు నమోదు కావడంతో ఉదయం 11 గంటలకే రోడ్లన్నీ నిర్మాను ష్యంగా మారాయి. పలు వ్యాపారాలు ఎండవేడిమికి తట్టుకోలేక మూసివేశారు. సాయంత్రం నాలుగు గంటల అనంతరం వ్యాపారులు షాపులు తెరిచారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనదారులు తమ వాహనాల ను ముదినేపల్లి – బంటుమిల్లి రోడ్డులో చెట్ల నీడన నిలిపివేశారు. 



Updated Date - 2022-05-27T05:40:17+05:30 IST