Advertisement
Advertisement
Abn logo
Advertisement

సందడే.. సందడి.. సందర్శకులతో కిటకిటలాడిన ట్యాంక్‌బండ్‌

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ఒకవైపు ఇళ్లల్లో ప్రతిష్టించిన చిన్న గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేసే భక్తులు, మరోవైపు ప్రతి ఆదివారం వచ్చే సందర్శకులతో ట్యాంక్‌బండ్‌ కిటకిటలాడింది. ప్రతి ఆదివారం సాయంత్రం 5నుంచి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి వాహనాలు రాకుండా కేవలం సందర్శకుల కోసం పర్యాటక కేంద్రంగా మార్చిన విషయం విదితమే. మూడవ ఆదివారం కావడంతో ఈసారి ప్రత్యేకంగా ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం టిఫిన్‌ సెంటర్‌, తినుబండారాల సెంటర్లు,  చెప్పులు, జువెల్లరీ స్టాల్స్‌, లేజర్‌షో, చిన్నారులు ఆడుకునేందుకు గేమింగ్‌జోన్‌ ఏర్పాటు చేశారు. దీంతో చిన్నారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ర్కీన్‌పై లేజర్‌షో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు డోలు వాయిద్యాలు, డప్పువాయిద్యాల నడుమ చిన్నారులు నృత్యం చేయడం కనిపించింది, ట్యాంక్‌బండ్‌పై ఉన్న చెట్లకు రంగురంగుల విద్యుత్‌బల్బులు ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ దీపాల నడుమ సెల్ఫీలు దిగడం కనిపించింది. ట్యాంక్‌బండ్‌పై పూర్తిగా రాకపోకలు నిలిపివేయడంతో వేలాది మంది సందర్శకులతో  ట్యాంక్‌బండ్‌ కిటకిటలాడింది. ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించగా, ట్రాఫిక్‌జామ్‌ కాకుండా పార్కింగ్‌కు కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేయిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. 


Advertisement
Advertisement