Abn logo
Sep 25 2021 @ 18:45PM

సన్‌ డే ఫన్‌ డే లో ఉమెన్‌ సేఫ్టీ పై అవగాహనా కార్య క్రమం

హైదరాబాద్‌: ప్రతి ఆదివారం ప్రభుత్వం టాంక్‌బండ్‌ను సన్‌ డే ఫన్‌ డేగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పైగా ఈ ఆదివారం పెద్దయెత్తున వివిధ రకాల ఎంటర్‌ టెయిన్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ పోలీసులు ఈనెల 26వ తేదీ ఆధివారం కార్యక్రమంలో భాగంగా మహిళా సేఫ్టీపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. మహిళల వేధింపుల నివారణకు పోలీస్‌ శాఖ ఏర్పాటుచేసిన షీ టీమ్స్‌ నేతృత్వంలో ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్శహింనున్నారు. 


లీడ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ బాగస్వామిగా షీ టీమ్స్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే బిగ్‌ఎఫ్‌ఎం , ఏరోక్‌ డాన్స్‌ ఫిట్‌నెస్‌ వారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. మఙళల సంరక్షణకు తెలంగాణ పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జుంబా, సెల్ఫ్‌ ప్లేయ్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, టెక్నిక్స్‌ను మహిళలకు వివరించనున్నారు. ఎఫ్పుడైనా వేధింపులు ఎదురైతే ఎలా ఎదుర్కొనాలన్న విషయం పై వివరిస్తారు. పిల్లలు, యువతులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.