Abn logo
Oct 18 2020 @ 04:36AM

అనాథ బాలిక మృతిపై సుమోటోగా విచారణ

న్యాయవాది లేఖపై స్పందించిన హైకోర్టుకు


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో మారుతి అనాథాశ్రమంలో 14ఏళ్ల బాలిక  మృతికి సంబంధించి న్యాయవాది ఆచంట మమతా రఘువీర్‌ రాసిన లేఖను హైకోర్టు రిట్‌ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. ‘‘ప్రభుత్వం జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్‌ జస్టిస్‌ కమిటీలను ఏర్పాటు చేసి ఉంటే ఇటువంటి కేసులు పెరిగేవి కావు. వెంటనే ప్రభుత్వం ఆయా కమిటీలను ఏర్పాటు చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాను’’ అని మమత విజ్ఞప్తి చేశారు. వ్యాజ్యంలో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం, స్ర్తీ, శిశు సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయ సేవాధికార సంస్థ, జువెనైల్‌ జస్టిస్‌ సభ్యకార్యదర్శి,, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా సంక్షేమ శాఖాధికారులను చేర్చారు. 

Advertisement
Advertisement