సుమో బాలుడు

ABN , First Publish Date - 2021-02-05T05:41:59+05:30 IST

సుమోలు అనగానే భారీ శరీరంతో కుస్తీ పట్టేవాళ్లు గుర్తుకువస్తారు. జపాన్‌కు చెందిన ఈ పదేళ్ల బాలుడు కూడా కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. గత ఏడాది పదేళ్ల లోపు పిల్లల

సుమో బాలుడు

సుమోలు అనగానే భారీ శరీరంతో కుస్తీ పట్టేవాళ్లు గుర్తుకువస్తారు. జపాన్‌కు చెందిన ఈ పదేళ్ల బాలుడు కూడా కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. గత ఏడాది పదేళ్ల లోపు పిల్లల విభాగంలో ఛాంపియన్‌ షిప్‌ కూడా గెలిచాడు. ఇతడి పేరు కియుట కుమగాయ్‌. ఇంతకీ అతడి బరువెంతో తెలుసా.... 85 కిలోలు. తన వయసు పిల్లల కన్నా రెండు రెట్లు బరువు ఉన్న ఈ పిల్లాడు పట్టు పట్టాడంటే అవతలివారు అల్లాడాల్సిందే. ‘‘నాకన్నా పెద్దవాళ్లను ఓడించడంలో మజా ఉంటుంది’’ అంటున్న కియుటకు శిక్షణ ఇచ్చేది ఎవరో కాదు అతడి తండ్రే.


వారంలో ఆరు రోజులు స్థానిక సుమో క్లబ్‌లో లేదంటే బరువులు ఎత్తుతూ సాధన చేస్తాడు. ‘‘సుమోకు ఉండాల్సిన లక్షణాలన్నీ మావాడిలో ఉన్నాయి. అతడిలో ఏదో ప్రత్యేకత ఉంది. కియుటకు నేను ఏమీ చెప్పను. అతడు తనంతట తానే అన్నీ చేసేస్తాడు’’అంటూ మురిపిసోతారు కియుట తండ్రి తైసుకే.

Updated Date - 2021-02-05T05:41:59+05:30 IST