నేటి నుంచి వేసవి సెలవులు

ABN , First Publish Date - 2022-05-06T05:29:55+05:30 IST

పాఠశాల తలుపులకు శుక్రవారం నుంచి రెండు నెలలు పాటు తాళాలు పడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ తదితర అన్ని యాజమన్యాలకు చెందిన విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 16న పాఠశాలలను తెరిచిన సంగతి తెలిసింది.

నేటి నుంచి వేసవి సెలవులు

జూలై 4న పాఠశాలలు పునఃప్రారంభం

కలెక్టరేట్‌, మే 5: పాఠశాల తలుపులకు శుక్రవారం నుంచి రెండు నెలలు పాటు తాళాలు పడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ తదితర అన్ని యాజమన్యాలకు చెందిన విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 16న పాఠశాలలను తెరిచిన సంగతి తెలిసింది.  కరోనా ప్రభావం లేకపోవడంతో ఇప్పటి వరకూ విద్యా సంస్థలు నిరాటంకంగా కొనసాగాయి. ఒకటి నుంచి 9వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్షలు ముగియడంతో వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 9 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తిరిగి జూలై4న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గతంలో 45 రోజులు మాత్రమే వేసవి  సెలవులు ఉండేవి. ఈ సారి  రెండు నెలల పాటు సెలువులు ఇచ్చారు.  చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో విద్యార్థుల కోసం కలెక్టర్‌ ఈ ఏడాది సెలవుల్లో ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. అవకాశం ఉన్న విద్యార్థులు వినియోగించుకోవాలని డీఈవో జయశ్రీ కోరారు. 

-----------


Read more